చిక్కడపల్లి : మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు.
గాంధీనగర్ డివిజన్లో అశోక్‌నగర్ విక్టోరియా కేఫ్ లైన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా సోమవారం పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆశా వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, యువజన విభాగం రాష్ట్ర నాయకుము ముఠా జయసింహ, సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, మాచర్ల పద్మజ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.