Suicide | బండ్లగూడ, జూన్ 15 : కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవాని నగర్లో నివాసముండే కుమారస్వామి రెడ్డి శనివారం సాయంత్రం ఇంట్లో గొడవపడ్డాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.