Medchal | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 5 : తన పిల్లలు ఆడుకుంటున్న సెటిల్ కాక్ చెట్టుపై పడడంతో దానిని తీసేందుకు కేబుల్ వైర్ సహాయంతో ప్రయత్నించగా పైన ఉన్న 11 కెవి వైర్‌కు తగిలి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీ ఈస్ట్ గోదావరి సామర్లకోటా మండలం పోవారా గ్రామానికి చెందిన పిల్లి శేషు కుమార్ (42) గత కొంతకాలం కిందట నగరానికి వలస వచ్చి జీడిమెట్ల వెన్నెలగడ్డలో నివాసముంటు మూసాపేట్ జిల్లా రిజిస్టర్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం తాను ఉంటున్న ఇంటి ముందు తన పిల్లలు సెటిల్ ఆడుతుండగా కాక్ ఓ చెట్టుపై పడింది. దానిని తీసే క్రమంలో పక్కనే ఉన్న మరో కేబుల్ వైర్ సహాయంతో ప్రయత్నించగా చెట్టుపై ఉన్న 11 కెవి వైర్లకు తగిలి ఒక్కసారిగా కరెంట్ షాక్‌తో శేషు కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.