హైదరాబాద్ : ఫార్మసీలో పని చేస్తున్న ఓ వ్యక్తి కస్టమర్లకు మెడిసిన్స్ ఇస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. వివరాల్లోకి వెళ్తే..మేడ్చల్ జిల్లా(Medchal) కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో(Meds Pharmacy) పని చేస్తున్న మురళి అనే వ్యక్తి షాపుకు వచ్చిన వారికి మందులు అందజేశాడు. అనంతరం బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు(Heart attack) రావడంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు. గమనించిన తోటి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టేలోపే మురళి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీసీ ఫుటేజ్.. గుండెపోటుతో వ్యక్తి మృతి
హైదరాబాద్ – మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి, షాపుకు వచ్చిన వారికి మందులు ఇచ్చి.. బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు. pic.twitter.com/5vniumlLRd
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2024