పీర్జాదిగూడ, డిసెంబర్ 29: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి పర్వతాపూర్ సాయిప్రియ కాలనీ ప్లాట్స్ ఓనర్స్ గత కొన్నేండ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్య లకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్థానిక మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అధ్యక్షతన సాయిప్రియ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాయి ప్రియ కాలనీ ప్లాట్ ఓనర్స్ సమస్యను మేయర్‌తో కలిసి పలుమార్లు మంత్రి కేటీఆర్‌కు వివరించామన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భూ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులతో కలిసి సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతోనే సాయిప్రియకాలనీలో భూవివాదాలు తలెత్తాయన్నారు.మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి చొరవతో కాలనీవాసులకు శాశ్వత పరిష్కారం లభించడంతో కాలనీవాసుల తరుఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు శారద ఈశ్వర్‌రెడ్డి, హరిశంకర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, నాయకులు రవీందర్, అంజిరెడ్డి కో ఆప్షన్ సభ్యులు జావిద్‌ఖాన్ సాయిప్రియ కాలనీ వాసులు ఉన్నారు.