Hyderabad | హైదరాబాద్‌లో జలమండలి నిర్లక్ష్యానికి వృద్ధుడు బలయ్యాడు. ఫిలింనగర్లో డ్రైనేజీ మరమ్మతుల కోసం గోతులు తవ్వి.. రక్షణ లేకుండా వాటిని అలాగే వదిలేయడంతో ప్రమాదవశాత్తూ అందులో పడి వృద్ధుడు మరణించారు.
వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మినీగుల్షన్ కాలనీకి చెందిన గులాం మహమ్మద్ (78) మార్చి 31వ తేదీన బైక్‌పై వెళ్తుండగా సూర్యానగర్ సమీపంలో వాహనం అదుపుతప్పి డ్రైనేజీ కోసం తవ్విన గోతిలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడి గులాం మహమ్మద్‌ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఏప్రిల్ 1వ తేదీ సోమవారం కన్నుమూశాడు. దీంతో కాంట్రాక్టర్, జలమండలి నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మరణించాడని మృతుడి కుమారుడు అమీర్ సయ్యద్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.