చిక్కడపల్లి : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R Krishnaiah ) తెలిపారు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అధ్యక్షతన ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బీసీల సత్యగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్(BC Reservations) ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ (Congress) పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర మాట్లాడుతూ బీసీలకు లెక్క తీస్తే రాజ్యాధికారం వస్తుందని ప్రభుత్వాలు భయం పట్టుకుందని అన్నారు. హామీ ఇచ్చిన విధంగా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్(MLA Mutha Gopal) మాట్లాడుతూ కాంగ్రెస్ బీసీలకు అచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల్లో మరింత చైతన్యం రావాల్సి అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, మాజీ విప్ వినయ్ భాస్కర్, కాంగ్రెస్ నాయకలు డాక్టర్ వినయ్‌కుమార్, జస్టిస్ చంద్రకుమార్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జూలూరి గౌరీ శంకర్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ తదితరలు హాజరై మద్దతు తెలిపారు.