రామంతాపూర్, జూలై 12 : నవమాసాలు మోసిన ఓ తల్లి.. తన పసికందును రోడ్డు పక్కన పారేసింది. గుక్క పట్టి ఏడ్చుతుండగా స్థానికుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు దవాఖానకు తరలించారు. ఈ ఘటన రామంతాపూర్‌లో చోటు చేసుకున్నది. వివరాల్లో వెళ్తే.. రామంతాపూర్ వివేక్‌నగర్‌లో రోడ్డు పక్కన ఓ పసికందు ఏడ్చుతున్నాడు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానిక యువకుడు కౌశిక్ గమనించి.. దగ్గరికి వెళ్లి పరిశీలించి.. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘట నా స్థలానికి చేరుకుని.. 108కు సమాచారం అందించగా.. వారు వచ్చి మగశిశువును అంబులెన్స్‌లో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆ శిశువు క్షేమంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.