త్యాగాల గుర్తులు..
ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల జ్యోతి వద్ద అద్భుతం ఆవిష్కృతమైంది. అమరుల స్తూపానికి సీమ్‌లెస్ స్టీలును వినియోగించగా.. అద్దంలా ఉన్న దానిపై తెలుగుతల్లి ఫ్లై ఓవర్ ప్రతిబింబం ఇలా కనిపిస్తూ.. కనువిందు చేస్తున్నది.
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 17: దేశానికి యువత శక్తి ఎంతో ముఖ్యమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ అన్నారు. మన దేశంలో 25 కోట్ల మంది యువత ఉన్నారని, యువత తలచుకుంటే ఏదైనా చేయవచ్చని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆంధ్రమహిళా సభ (ఏఎంఎస్) ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ వుమెన్ 6వ పట్టాల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. 2017-20, 2018-21, 2019-22 బ్యాచ్‌లలో డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు మూడు బ్యాచ్‌లలో పీజీ పూర్తి చేసిన మొత్తం 869 మంది విద్యార్థులకు పట్టాలు, 51 మందికి బంగారు పతకాలను ప్రదానం చేశారు. కళాశాలలోని ఎంవీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మన దేశంలో 85 వేల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని, ఇవి ప్రపంచంలోనే మూడో అత్యధికమని పేర్కొన్నారు. విద్యను పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ తన మాతృభూమితో పాటు సమాజానికి ఏదో మంచి చేయాలని పిలుపునిచ్చారు. యూజీసీ నుంచి ఏఎంఎస్ కళాశాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీని బాధ్యత తీసుకోవాల్సిందిగా నవీన్ మిట్టల్‌కు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలేజియేట్ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్, డీడీఎంఎస్ అధ్యక్షురాలు ఉషారెడ్డి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ జీఎల్‌కే దుర్గ, ప్రొఫెసర్ ఉషా మునిపల్లి, ప్రొఫెసర్ నకులారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.