Hyderabad | హైదరాబాద్లోని అత్తాపూర్లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున శిఖరా వన్ అపార్ట్మెంట్స్లోని తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడ్డాడు. పైనుంచి పార్క్ చేసి ఉన్న కారుపై పడటంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ సెక్యూరిటీ సిబ్బంది కారు వద్దకు వచ్చి చూడగా.. తీవ్రగాయాలతో పడిఉన్న వ్యక్తి కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడా? లేదా ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.