మారేడ్పల్లి, ఆగస్టు 30 : పెండ్లి ఇష్టం లేక ఓ వ్యక్తి రైలు(Train) కింద పడి ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్ జిల్లా ఘటుకేసర్లోని ఎల్ఎన్ నగర్ ప్రాంతానికి చెందిన కె.వి నర్సింహ్మ మూర్తి (38) నాచారంలోని కెఆర్పి పవర్ ప్లాంట్లో ఎలక్రిక్టల్ ఇంజినీరుగా పని పని చేస్తున్నాడు. అయితే కుటుంబ సభ్యులు నర్సింహ్మ మూర్తిని పెళ్లి(Marriage) చేసుకోవాలని చెబుతున్నప్పటికి దాట వేస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలో గత 10 రోజుల క్రితం ఓ యువతిలో నర్సింహ్మ మూర్తికి ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి ఇష్టం లేకపోవడంతో అతను ఘటుకేసర్-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మద్యన సికింద్రాబాద్ నుంచి కాజిపేట వైపు వెళ్లే పుష్పుల్ ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదే హాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడికి పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసుల ప్రాథమిక ధర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.