హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లిన లారీ దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లే నిర్మాణంలో ఉన్న భవనం ఆవరణలో హరే రామ్ అనే కార్మికుడు నిద్రిస్తున్నాడు. ఇదే క్రమంలో అతనిపై నుంచి రెడీ మిక్స్ లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీహార్ వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.