హైదరాబాద్ : హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని కడపకు చెందిన న్యాయవాది శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు. లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. న్యాయవాది ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.