సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందిన టీ హబ్‌ను 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల బృందం బుధవారం సందర్శించింది. టీహబ్‌లో స్టార్టప్ నిర్వాహకులతో ఐఏఎస్ అధికారుల బృందం ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రతినిధులు వివిధ రంగాలకు చెందిన స్టార్టప్‌లు, వాటి ఆలోచనలు, వ్యాపార కార్యకలాపాలను వారికి వివరించారు. ఐఏఎస్ అధికారుల బృందంతో పాటు తెలంగాణ ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి టీ హబ్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు.