Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్లోని తార్నాకలో దారుణం జరిగింది. ఓ యువకుడు బైక్పై వెళ్తుండగా రోడ్డుపై ఓ యువతి కనిపించింది. లిఫ్ట్ కావాలా అంటూ ఆ యువతితో మాట కలిపాడు.
ఇక లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, ఆమెను బైక్పై ఎక్కించుకున్నాడు. కొంచెం దూరం వెళ్లగానే.. ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకేందుకు యత్నించాడు. దీంతో యువతి భయపడిపోయి.. బైక్పై నుంచి కిందకు దూకింది. దీంతో ఆ బైక్ వెనుకాల వస్తున్న లారీ కింద యువతి పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టారు.