Hyderabad | హైదరాబాద్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మైలార్‌దేవ్‌పల్లిలో ఓ యువకుడిని కారుతో ఢీకొట్టి, అనంతరం దాడి చేసి మెడలోని బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మీగూడ వద్ద బైక్‌పై వెళ్తున్న నాగరాజును కారుతో ఓ గ్యాంగ్ ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో కింద పడిన నాగరాజుపై ఆ గ్యాంగ్ దాడి చేసింది. పిడిగుద్దులు గుద్ది, అతని మెడలోని బంగారు చైన్‌ను లాగేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యరు. ఈ ఘటనపై బాధితుడు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దోపిడీ గ్యాంగ్ TS07JG5783 నంబర్ గల కారులో వచ్చినట్లుగా పేర్కొన్నాడు.