హైదరాబాద్ : బ్రాండెడ్ వస్తువుల(Branded goods) పేరిట నకిలీ వస్తువులు(Fake goods) తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ రెడ్ లేబుల్, బ్రూక్‌బాండ్ టీ పౌడర్, లైజాల్, హార్పిక్, సర్ఫ్ ఎక్స్ తయారు చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ వస్తువుల తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.