గుక్కెడు నీటి కోసం అవస్థలు
ఎకరానికి వంద కోట్లకు పైగా విలువ చేసే భూముల మధ్య నివసిస్తున్న ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారని, గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి మండిపడ్డారు. నార్సింగిలో శనివారం నిర్వహించిన ‘వాక్ ఫర్ వాటర్' పాదయాత్రలో స్థానిక ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో భారీ ఎత్తున కార్తిక్‌రెడ్డి నిరసన తెలిపారు.
- సమస్యలపై పోరాటానికి నేనెప్పుడూ సిద్ధమే
- రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి
- ‘వాక్ ఫర్ వాటర్’ పేరిట నార్సింగిలో పాదయాత్ర
మణికొండ, మే 16 :ఎకరానికి వంద కోట్లకు పైగా విలువ చేసే భూముల మధ్య నివసిస్తున్న ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారని, గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి మండిపడ్డారు. నార్సింగిలో శనివారం నిర్వహించిన ‘వాక్ ఫర్ వాటర్’ పాదయాత్రలో స్థానిక ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో భారీ ఎత్తున కార్తిక్‌రెడ్డి నిరసన తెలిపారు. నార్సింగి వాటర్ ట్యాంక్ నుంచి పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు సాగిన ఈ పాదయాత్రలో మహిళలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ రోజు విడిచి రోజు కూడా తాగునీరు అందక నార్సింగి, బండ్లగూడ, మణికొండ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారన్నారు. బల్క్ కనెక్షన్ల పేరుతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై జలమండలి భారం మోపుతుందని ఆరోపించారు. ఈ ప్రాంతానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్‌గౌడ్ ప్రజలకు నాలుగురోజులకు ఒకసారి కూడా నీళ్లు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్‌గౌడ్ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఈ ప్రాంతానికి రావాల్సిన మెట్రోతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని జంట జలాశయాలు చెంతనే ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు గుక్కెడు నీరు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కార్తిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ‘వాక్ ఫర్ వాటర్’ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగిస్తామని కార్తిక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.విష్ణువర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ మైనార్టీ విభాగం ఇన్చార్జి షేక్ ముక్తార్పాష, మణికొండ పార్టీ నాయకులు సీతారాం దూళిపాళ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

