హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్(Gas cylinders) లోడ్‌తో వెళ్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు(Fire accident) చెలరేగాయి. అప్రత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలుపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన అల్వాల్‌లోని(Alwal) రాజీవ్ రాహదారి(Rajiv Road) వద్ద చోటు చేసుకుంది.
గ్యాస్ సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న మిని వ్యాన్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచా రమిచ్చాడు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.