ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 29 : తార్నాక (Tharnaka)డివిజన్లోని కిమ్టీ కాలనీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం(Fire accident) సంభవించింది. క్షణాల మీద వ్యాపించిన మంటలతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయభ్రాం తులకు గురయ్యారు. ప్రమాదసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
విషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.