నార్నూర్ : వందరోజుల హామీలు ( Congress Promises ) వెయ్యి రోజులైనా నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని నార్నూర్ ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం చైర్మన్ ఆడే సురేష్ ఆరోపించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ), గాదిగూడ ( Gadiguda ) మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్లా కార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెపుతారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాథోడ్ సుభాష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుల్తాన్ ఖాన్, రైతులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.