Fake Casting Calls | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పేరుతో వస్తున్న ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై ప్రముఖ నిర్మాణ సంస్థ అప్రమత్తం చేసింది. తమ సంస్థ పేరుతో కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు తప్పుడు ఆఫర్లు ఇస్తూ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని, వాటిని నమ్మవద్దని స్పష్టం చేసింది. తమ తరఫున ఆడిషన్స్ నిర్వహించడానికి లేదా కాస్టింగ్ ప్రక్రియ చేపట్టడానికి ఎలాంటి థర్డ్-పార్టీ ఏజెన్సీలను గానీ, వ్యక్తులను గానీ తాము ఎవరినీ అధికారికంగా నియమించలేదని స్పష్టం చేసింది. ఎవరైనా తమ ప్రతినిధులమని చెప్పి సంప్రదిస్తే వ్యక్తిగత సమాచారం, ఆడిషన్ వివరాలు ఇవ్వవద్దని, అలాగే ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని హెచ్చరించింది. తమ నిర్మాణ సంస్థ పేరును అనధికారికంగా వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైజయంతీ మూవీస్ హెచ్చరించింది. ఏదైనా సమాచారం కోసం కేవలం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే సంప్రదించాలని కోరింది.
Important Clarification:
Please beware of fake casting calls and individuals falsely claiming to represent #VyjayanthiMovies.#Kalki2898AD pic.twitter.com/THPfGvUcmD
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 3, 2026