Dog Attack | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి వీధి కుక్కలు(Dogs) రెచ్చిపోయాయి. దిల్సుఖ్నగర్ సంఘటన మరవకముందే నిజాంపేట్(Nizampet)లో మరో చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బండారి లేఔట్ కాలనీలోని ఓ పార్కులో పార్కులో ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల పాపపై వీధి కుక్క దాడి(Dog Attack) చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. మెడపై గాయాల పాలైన బాలికను తల్లిదండ్రులు దవాఖానకు తలరించారు.
కాగా, దిల్సుఖ్నగర్లోని శాంతి నగర్లో గురువారం రాత్రి ఓ ముగ్గురు చిన్నారులు తమ ఇంటి ముందు ఆడుకునేందుకు బయటకు వచ్చారు. రోడ్డుపై ఓ రెండు కుక్కలు అరుస్తూ దూసుకురావడాన్ని చిన్నారులు గమనించారు. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా పిల్లలు ముగ్గురు గేటు లోపలికి పరుగెత్తారు. అయినప్పటికీ ఓ కుక్క వెంబడించి, ముగ్గురిలో ఒకరిపై దాడి చేసింది. ఆ అపార్ట్మెంట్ గేటుకు కొంచెం దూరంలో ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తమై కుక్కను తరిమాడు. కుక్క దాడిలో బిట్టు అనే ఐదేండ్ల బాలుడి తొడకు గాయమైంది. అనంతరం బాబును చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు అధికారులకు మొర పెట్టుకున్నారు.