హైదరాబాద్ : నగరంలోని మాసబ్ ట్యాంక్(Masab tank) వద్ద ఈరోజు తెల్లవారుజామున ఉదయం 3 సమయంలో పెద్ద కంటైనర్(Container truck) మూలమలుపు వద్ద పల్టీ కొట్టింది. మూసాపేట్ నుంచి జడ్చర్ల వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఐదు గంటల పాటు రెండు క్రేన్లతో శ్రమించి కంటైనర్ను అక్కడి నుండి తరలించారు. కంటైనర్లో గ్లాస్ ఐటమ్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మాసబ్ ట్యాంక్ నుండి మెహదీపట్నం వెళ్లే దారిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది.