Hyderabad | హైదరాబాద్ : పాతబస్తీ మాదన్నపేటలో దారుణం జరిగింది. కుక్క మలవిసర్జనపై ప్రశ్నించిన ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ భార్య విచక్షణారహితంగా దాడి చేసింది. మహిళ దాడితో వృద్ధురాలు గజగజ వణికిపోయింది.
మాదన్నపేటలో నివాసముంటున్న ఓ కానిస్టేబుల్.. తన రెండు కుక్కలను తీసుకొచ్చి ఓ వృద్ధురాలి ఇంటి ముందు మలవిసర్జన చేయించాడు. దీంతో కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని వృద్ధురాలు ప్రశ్నించింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన భార్యను అక్కడికి పిలిపించాడు.
ఇక 60 ఏండ్ల వృద్ధురాలిపై కానిస్టేబుల్ భార్య దాడి చేసింది. దాదాపు రెండు నిమిషాల పాటు ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ.. కర్రతో దాడి చేసింది. దీంతో భయపడ్డ వృద్ధురాలు అక్కడ్నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది. అయినా కూడా కానిస్టేబుల్ భార్య కనికరం చూపించలేదు. మరోసారి కర్రతో దాడి చేసి గాయపరిచింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాధితురాలు మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై దారుణంగా దాడి చేసిన కానిస్టేబుల్ కుటుంబసభ్యులు
హైదరాబాద్ – మాదన్నపేటలో దారుణం
తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని ప్రశ్నించిన వృద్ధురాలు
దీంతో తన భార్య,… pic.twitter.com/W5bwZ1Ngx2
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2025