Goshamahal | హైదరాబాద్ : గోషామహల్లో భారీ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ప్లైవుడ్ దుకాణాల ముందు ఉన్న చాక్వాడి నాలా మరోసారి కుంగిపోయింది. దీంతో క్రషర్ లారీ నాలాలో కూరుకుపోయింది. లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
గతంలో ఇదే ప్రాంతంలో చాక్వాడి నాలా కుంగిపోయింది. ఆ నాలా పనులు చేస్తుండగా.. ఇప్పుడు మరోసారి నాలా కుంగింది. నాలా పనుల నిమిత్తం క్రషర్‌ను తీసుకొచ్చిన లారీనే కూరుకుపోయింది. నాలాలో ఆ లారీ ఇరుక్కుపోయినప్పటికీ, డ్రైవర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాలా కుంగిపోవడంతో డ్రైనేజీ నీరు వదరలై పారుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలా మొత్తం పునరుద్ధరించాలని అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను స్థానికులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Traffic Restrictions | ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నేడు హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు