బంజారాహిల్స్,ఆగస్టు 8: నిధులను దుర్వినియోగానికి పాల్పడిన జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో క్యాషియర్ మీద చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భరత్ మణి (34) అనే వ్యక్తి ఆరేళ్లుగా క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగే టీవీ సీరియల్స్ షూటింగ్, ఓటీటీలో ప్రసారమయ్యే వెబ్‌సీరిస్‌లకు సంబంధించిన షూటింగ్స్‌కు చెందిన ఆర్థిక లావాదేవీలు భరత్ మణి చూస్తుంటారు. రోజువారీగా వచ్చే ఆదాయంతో పాటు నిర్వహణ ఖర్చులు, చెల్లింపులు చేస్తుంటారు. కాగా, భరత్ ఇటీవల రూ.30వేలను డీజిల్ బిల్లు వచ్చినట్లు లెక్కల్లో చూపించాడు.
అయితే ఆ డబ్బులను తీసుకున్నట్లు గుర్తించిన సంస్థ యాజమాన్యం డీజిల్‌కు సంబంధించిన బిల్లులపై ఆడిటింగ్ నిర్వహించింది. డీజిల్ పేరుతో సుమారు రూ.12 లక్షల మేర మోసానికి పాల్పడ్డట్లు తేలడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ఆపరేషన్స్ జీఎం అన్నే చిరంజీవి గీతాధర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.