బేగంపేట, జనవరి 21: బేగంపేట ైప్లె ఓవర్‌పై ఉన్న డివైడర్‌ను ఢీకొని ఓ కారు బోల్తా కొట్టింది. అన్నపూర్ణ కాలనీకి చెందిన నర్సింహులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ బాలాజీ యాప్రాల్ నుంచి కొండాపూర్‌కు వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌తో పాటు బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.