హైదరాబాద్ : చందానగర్‌లోని( Chandanagar) ఓ పెట్రోల్ బంకు వద్ద కారులో(Car) అకస్మాత్తుగా మంటలు(Fire accident) చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి కారులో డీజిల్ నింపుకొని బంకు బయటకు రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను ఆర్పారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్వి వివరాలు తెలియాల్సి ఉంది.