న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సాక్షిగా పాకిస్థాన్‌కు కౌంటర్ ఇచ్చింది ఇండియా. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఇండియా హెచ్చరించింది. ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు భారత్ పేర్కొన్నది. పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ చేసిన ప్రసంగానికి కౌంటర్‌గా ఇండియా ఈ వ్యాఖ్యలు చేసింది. యూఎన్‌లోని భారత ప్రతినిధి పీతల్ గెహ్లాట్(Petal Gehlot) మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. అలాంటి చర్యలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. భారత్‌తో పాటు జమ్మూకశ్మీర్‌పై పాక్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.
ఉగ్రవాదం, ప్రజాస్వామ్య హక్కులు, మైనార్టీలను ఆదరిస్తున్న తీరుపై పాక్ వైఖరిని భారత్ ఖండించింది. పాక్ చేపడుతున్న సీమాంతర ఉగ్రవాద చర్యలకు గత ఏడాది గట్టి జవాబు ఇచ్చామని, ఉగ్రవాదులు ఎక్కడికీ పారిపోలేరని, వాళ్లు దాచుకునే ప్రదేశం లేదని, స్వీయరక్షణ హక్కును వినియోగిస్తూ, ఉగ్రవాదాన్ని తరిమేందుకు తాము వెనుకాడబోమని ఆమె అన్నారు. పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్ర చర్యలకు పరిణామాలు ఉంటాయన్నారు. ఉగ్రవాదం పట్ల పాక్ వైఖరి.. ఆ దేశానికి కానీ, ప్రపంచానికి కానీ మేలు చేయదని పీతల్ గెహ్లాట్ అన్నారు.
#WATCH | Exercising the right of reply of India on #Pakistan PM #ShehbazSharif‘s speech, First Secretary in India’s Permanent Mission to the #UN, Petal Gahlot says, “This afternoon, the General Assembly heard some bizarre remarks from the representative of Pakistan. This happens… pic.twitter.com/TyjbEzCipG
— DD India (@DDIndialive) September 26, 2026