శంషాబాద్ రూరల్, జూలై 13 : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ కారులో మంటలు చెలరేగాయి. ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి ఆదివారం ఉదయం కారు రాగా, ఒక్కసారిగా అందులో మంటలు రావడంతో గమనించిన డ్రైవర్.. కిందకు దిగాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు పూర్తిగా ఆర్పివేశారు. అప్పటికే కారు ముందుభాగం కాలిపోయింది. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.