హైదరాబాద్ : చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత( Married woman) దారుణ హత్యకు(Brutal murder) గురైంది. నల్లగండ్ల లక్ష్మీ విహార్ లో నివాసం ఉంటున్న విజయ లక్ష్మి(32) అనే మహిళను నిందితుడు కత్తితో గోంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలు కర్ణాటకకు చెందిన మహిళగా గుర్తించారు. కాగా, నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.