బేగంపేట, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉన్నదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం సికింద్రాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయంలో 69 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే కాంగ్రెస్ ప్రభు త్వం బడ్జెట్లో పొందుపర్చడం విడ్డూరంగా ఉందన్నారు.
ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు గత బడ్జెట్లో కూడా ప్రకటించారని, ఎక్కడ ఇచ్చారో చూపిస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, కుర్మ హేమలత పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. 15 నెలలు గడుస్తున్నా.. స్పందించడం లేదని ఓ లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.