Banjara hills | హోమ్‌వర్క్ మానేసి ఫోన్లో చాటింగ్ ఎందుకు చేస్తున్నావని అడిగినందుకు సూసైడ్ చేసుకున్న 8వ విద్యార్థిని
‘చదువును పక్కన పెట్టి తరచూ సెల్ఫోన్లో ఎందుకు చాటింగ్ చేస్తున్నావంటూ’ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
- తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య
బంజారాహిల్స్, సెప్టెంబర్ 16 : ‘చదువును పక్కన పెట్టి తరచూ సెల్ఫోన్లో ఎందుకు చాటింగ్ చేస్తున్నావంటూ’ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన సంజీబ్ మండల్ అనే ఎలక్ట్రీషియన్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నూర్‌నగర్‌లో కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నాడు.
కాగా, సంజీబ్ మండల్ కుమార్తె ఇషికా మండల్(13) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. గత కొంతకాలంగా స్కూల్ నుంచి రాగానే ఇషికా మండల్ ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నది. వాట్సాప్‌లో చాటింగ్ చేయడంతోపాటు గేమ్స్ ఆడుతుండటంతో పలుమార్లు తల్లిదండ్రులు మందలించారు. శుక్రవారం స్కూల్ నుంచి వచ్చిన ఇషిక హోమ్‌వర్క్ కూడా చేయకుండా సెల్ఫోన్లో చాటింగ్ చేస్తున్నది. దీంతో తండ్రి సంజీబ్ మండల్తోపాటు తల్లి పూర్ణిమ ఆమెను తీవ్రస్థాయిలో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఇషిక గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

