Hyderabad | మెహిదీపట్నం, ఏప్రిల్ 25 : నగరంలో హవాలా డబ్బులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని మాసబ్ ట్యాంక్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి రూ. 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపిన వివరాల ప్రకారం… మాసబ్ ట్యాంక్ ఏసీ గార్డ్స్‌లో నివసించే మహమ్మద్ అఖిల్(34) మేకల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడు దుబాయ్‌కు చెందిన అబ్బు అనే వ్యక్తి సూచనలతో హవాలా డబ్బును నగరంలో చలామణి చేస్తున్నాడు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ ఏసీ గార్డ్స్ ప్రాంతంలో రూ. 8 లక్షలు తీసుకెళ్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డబ్బులను ఆదాయ శాఖ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.