Durga Mata | సుల్తాన్‌బజార్,సెప్టెంబర్ 22: ఇసామియా బజార్లో నిర్వహించే అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ అమ్మవారి సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా 72 అడుగుల విగ్రహాన్ని దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిష్ఠించనున్నట్లు శ్రీ నవ దుర్గా నవరాత్రి ఉత్సవ సమితి చైర్మన్,తెలంగాణ గంగపుత్ర ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ గులాబ్ శ్రీనివాస్ తెలిపారు. 24 ఏండ్లుగా ఇసామియా బజార్‌లోని టెలివిజన్ గల్లీలో అత్యంత వైభవంగా నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ విగ్రహాన్ని నెల రోజుల ముందు కళాకారుడు నగేశ్ నేతృత్వంలో కోల్‌కతా నుంచి వచ్చిన 22 మంది కళాకారులు నిర్విరామంగా తయారు చేస్తారని వివరించారు. ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాన్ని చాదర్‌ఘాట్ సాయిబాబా దేవాలయం ఎదురుగా ఉన్న విక్టరీ ప్లే గ్రౌండ్లో శోభాయాత్ర అనంతరం నిమజ్జనం చేస్తారని తెలిపారు.