Jubleehills By Poll | అమీర్‌పేట్, అక్టోబర్ 15 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపధ్యంలో కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా బుధవారం రాత్రి సనత్‌నగర్ పోలీసులు రూ. 70 వేల నగుదును పట్టుకున్నారు. బోరబండకు చెందిన సుభాష్ పాటిల్ సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ మీదుగా మోతీనగర్ వెళ్లే మార్గంలో బ్రిగేడ్ సిటడెల్ ఎదురుగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో సుభాష్ పాటిల్‌ను రూ.70 వేల నగదుతో పట్టుకున్నారు. కాగా తాము పట్టుకున్న నగదుకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు.