63 అడుగుల దశ మహా గణపతి
చరిత్రలోనే తొలిసారి.. 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నారు.
- ఖైరతాబాద్‌లో ఎత్తైన మట్టి గణపతి
- నేడే వినాయక చవితి.. ఉ. 11.06 నిమిషాలకు తొలిపూజ
- 75 అడుగుల జంధ్యం, కండువా, గరిక మాలాంకరణ
- 300 మంది పోలీసు సిబ్బంది, 70 సీసీ కెమెరాలతో నిఘా
- నగరమంతా ఏకదంతుడి సందడి.. ముస్తాబైన మండపాలు
విఘ్నాలను తొలగించే లంబోదరుడు వాడవాడలా కొలువుదీరనున్నాడు. ఖైరతాబాద్ చరిత్రలోనే ఎత్తైన మట్టి గణపతి.. 63 అడుగుల దశ మహా గణపతికి సోమవారం వినాయకచవితి పర్వదినాన ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఉదయం 11.06 నిమిషాలకు తొలిపూజ మహాక్రతువును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది నగరవాసులు పర్యావరణహిత మట్టి ప్రతిమలకే ఎక్కువగా జై కొట్టారు. తమ ఇండ్లల్లో మట్టి గణపతులను పూజించేందుకే ప్రాధాన్యమిస్తున్నట్లు మార్కెట్ వర్గాల నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మండపాల వద్ద విద్యుత్ భద్రతా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)
చరిత్రలో తొలిసారిగా ఖైరతాబాద్‌లో ఏర్పాటు నేడు దశ మహా విద్యా గణపతికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం ఉదయం 11:06 గంటలకు తొలి పూజ హాజరుకానున్న గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం 75 అడుగుల జంధ్యం, కండువా, గరిక మాలాంకరణ 300మంది పోలీసు సిబ్బంది, 70సీసీ కెమెరాలతో నిఘా ప్రతిఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి దర్శనానికి 30లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 : చరిత్రలోనే తొలిసారి.. 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహాక్రతువుకు ఉదయం 11:06 గంటలకు తొలి పూజను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి నిర్వహిస్తారు.
దశ మహా విద్యా గణపతి విశిష్టతలు
63 అడుగుల ఎత్తు.. 28 అడుగుల వెడల్పుతో ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సరస్వతి, వారాహీ మాతలతో శ్రీ దశ మహా విద్యా గణపతి దశ హస్తాలతో కొలువు దీరనున్నారు. స్వామి వారిని కొలిస్తే బహుళ ఫలితాలు వస్తాయని దివ్యాజ్ఞాన సిద్ధాంతి తెలిపారు. వచ్చే ఏడాది క్రోది నామ సంవత్సరంలో కలిగే విఘ్నాలను తొలగించుకోవచ్చని చెప్పారు. అలాగే కుడివైపు కొలువుదీరిన పంచముఖ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుంటే పంచనారసింహ క్షేత్రాలను దర్శించిన ఫలితం దక్కుతుందని, ఎడమ వైపు శివుడి రుద్రావతారమైన శ్రీ వీరభద్రుడిని దర్శించుకుంటే ఇతి బాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
గుర్రం భగ్గీలో పట్టు వస్ర్తాలతో..
ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 75 అడుగుల కండువా, జంధ్యం, గరికమాల, పట్టువస్ర్తాలను గుర్రం భగ్గీలో ఉంచి, ఒగ్గుడోలు, గుస్సాడి నృత్య, కోలాట కళారూపాలతో ఊరేగింపు నిర్వహించి ఉదయం 7గంటలకు స్వామి వారి వద్దకు చేరుస్తారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్ధసారధి, గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, అడిషనల్ కమిషనర్ పి.విశ్వప్రసాద్, డీసీపీ రూపేశ్, అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్ హాజరై కానుకలను సమర్పిస్తారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా బారికేడ్లతో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ, జలమండలి తదితర శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయగా, పారిశుధ్య కార్యక్రమాలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులకు అస్వస్తత లాంటివి చోటు చేసుకుంటే వెంటనే వారికి వైద్య సేవలందించేందుకు తగిన శిబిరాలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
మహాగణపతి దర్శనానికి దారులు
మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఐమాక్స్ మీదుగా వచ్చే వారు గజ్జెలమ్మ దేవాలయం గల్లీ నుంచి వార్డు ఆఫీసు మీదుగా, సెన్షేషన్ థియేటర్, రైల్వే గేటు మార్గం ద్వారా వచ్చి దర్శనం అనంతరం మింట్ కాంపౌండ్ రూట్లో వెళ్లేలా క్యూలైన్లను పెట్టారు. స్థానిక భక్తుల కోసం వెనుక వైపు దారి ఉంచారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు పోలీసులతో పాటు వలంటీర్లు సహాయ పడుతారు.
300మంది పోలీసులు.. 70సీసీ కెమెరాలతో నిఘా
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ప్రతి ఏడాది నవరాత్రుల్లో సుమారు 20లక్షల నుంచి 30లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వార్డు ఆఫీసు, రైల్వే గేటు, మింట్ కాంపౌండ్, బడా గణేశ్ వెనుక వైపు నలుదిక్కులా సుమారు 70సీసీ కెమెరాలను అమర్చారు. ఇద్దరు ఏసీపీలు, సీఐల పర్యవేక్షణలో 300 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. అడుగడుగునా మెటల్ డిటెక్టర్లతో పాటు ఎనిమిది డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లను ఇప్పటికే అమర్చారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి పంపిస్తామని ఖైరతాబాద్ సీఐ బాల్గోపాల్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

