సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం ఉదయం 6 గంటలకు ‘ఐ వోట్ ఫర్ షూర్’పై 5కే రన్ నిర్వహించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు.
ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కేబీఆర్ పార్కులో పెద్ద ఎత్తున నిర్వహించాలని ఈఆర్ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.