ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెం ట్ విభాగం ప్రారంభమై యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం వైభవంగా స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ ఉ త్సవాలను పలువురు ప్రముఖులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, మే నేజ్మెంట్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్యామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనేజ్మెంట్ వి భాగం యాభై ఏళ్ల చరిత్రలో వేలాది మంది వి ద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిందని గుర్తు చే శారు.
సమాజానికి అద్భుతమైన నిపుణులను అందజేసిందని చెప్పారు. అంకితభావానికి, నైపుణ్యానికి వేదికగా నిలిచిందన్నారు. మేనేజ్మెంట్ రంగంలో ఓయూకు బలమైన ప్రపంచ స్థాయి పూర్వ విద్యార్థుల సమూహం ఏర్పడిందని పేర్కొన్నారు. ఓయూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ప్రపంచ స్థాయిలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యూనివర్సిటీ బ్రాండ్ ఈక్విటీని పెంపొందించడం ద్వారా యాభై ఏళ్లలో డిపార్ట్మెంట్ ప్రస్థానాన్ని, విజయాలను విభాగం హెడ్ ప్రొఫెసర్ డి. శ్రీరాములు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ప్రసన్నచంద్ర, టీవీ రావు, మేనేజ్మెంట్ డీన్ వెంకటయ్య, జహంగీర్, స్మిత సాంబ్రాణి, సం పత్ కుమార్, విద్యాసాగర్ రావు, సమున్నత, నరేశ్‌రెడ్డి పాల్గొన్నారు.