హత్యాయత్నం కేసులో 5 ఏండ్ల జైలు
ఐదేండ్ల క్రితం హత్యాయత్నం కేసులో నిందితుడికి న్యాయ స్థానం ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మెహన్ కథనం ప్రకారం... 2023లో మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేసి కోర్టుకు చార్జ్‌షీటును దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడు నేరం చేసినట్లు నిర్థారించింది.
మాదాపూర్, ఏప్రిల్ 8: ఐదేండ్ల క్రితం హత్యాయత్నం కేసులో నిందితుడికి న్యాయ స్థానం ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మెహన్ కథనం ప్రకారం… 2023లో మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేసి కోర్టుకు చార్జ్‌షీటును దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడు నేరం చేసినట్లు నిర్థారించింది.
వనస్థలిపూరంలోని ప్రశాంతి నగర్‌కు చెందిన రవీందర్ కుమారుడు తిరుపతి అనురాగ్ (25), అనిరుద్‌లు మాదాపూర్‌లోని వీఎఫ్ఎక్స్ స్టూడియో అయ్యప్ప సొసైటీ పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో పలుమార్లు గొడవ జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని జూలై 5, 2023న రాత్రి 9:15 గంటల సమయంలో తిరుపతి అనురాగ్ ఎలాగైన అనిరుద్‌ను చంపాలనే ఉద్ధేశ్యంతో మాదాపూర్‌లోని ఢీ మార్ట్‌లో కత్తిని కొనుగోలు చేసి వాళ్లు పనిచేసే ఆఫీసు దగ్గరలో ఉన్న టీ బ్రేవ్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుందాం రా అని పిలిచి తిరుపతి అనురాగ్ కత్తితో అనురుద్ మొఖం, ఛాతీ, మెడపై పలుమార్లు దాడి చేశాడు.
దీంతో అనిరుద్‌కు తీవ్ర గాయాలు కాగా తిరుపతి అనురాగ్ అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు సమీప దవాఖానాకు తరలించి చికిత్స అందించారు. ఈ కేసులో బాధితుడి తండ్రి మధుసూదనాస్వామి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌హెచ్‌వో ఎన్.తిరుపతి కేసు దర్యాప్తును రవికిరణ్‌కు అప్పగించగా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. బుధవారం కూకట్పల్లి 6వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి పావని, పీపీడీ ఉపేందర్ వాదనలు విన్న అనంతరం తిరుపతి అనురాగ్‌కు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Jail
- murder
- Murder Case
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

