రవీంద్రభారతి,జనవరి9: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలను మరోమారు మోసం చేయకుండా 42 శాతం రిజర్వేషన్లపై చట్టం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేదంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ సంక్షమే సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి అధ్యక్షతన 20 బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతం పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్చేయాలని కోరారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసి అసెంబ్లీ చట్టం చేస్తే చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు ఉండవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ,జడ్పీటీసీ, వార్డు మెంబర్లలో 42 శాతం రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. ఫిబ్రవరి నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని సీఎం ప్రకటించారని, ఇచ్చిన హామీ ప్రకారం చట్టాన్ని తీసుకువచ్చి ఎన్నికలను నిర్వహించాలని, లేదంటే బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదన్నారు. అసవరమైతే రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు,కులసంఘాలు,మేధావులతో కలిసి గుజ్జర్ల తరహాలో ఐక్యపోరాటాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నిమ్మల వీరన్న, మోదీ రామ్‌దేవ్,మల్లేష్, పి.సతీష్