HCU | సిటీ బ్యూరో, ఏప్రిల్1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం జీవ వైవిధ్యానికి కేంద్రం. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పచ్చటి ప్రకృతి పెనవేసుకుని ఉంది. వేలాది ఎకరాల్లో అరుదైన జీవ జాతులు ఉన్నాయి. వేలాది పక్షి జాతులు, వందలాది అరుదైన జంతువులు, లక్షలాది ఔషధ మొక్కలు నగర శివారుల్లోని భూముల్లో ఉన్నాయి. ఇవన్నీ విశ్వ నగరానికి ఊపిరితిత్తుల్లా పనిచేస్తున్నాయి. గ్రేటర్ ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందజేస్తున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జీవవైవిధ్యం గణనీయంగా పెరిగింది.
కేసీఆర్ ముందు చూపుతో మహా నగరంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని జీవన ప్రమాణాలు పెంచేవిధంగా నిర్ణయాలు తీసుకున్నారు. నగరం చుట్టూ ఉన్న ప్రకృతి సంపదకు ఎలాంటి నష్టం కలిగించకుండా జీవవైవిధ్యాన్ని పెంపొందించారు. పదేండ్లలో కోటి మొక్కలను నాటి అటవీ విస్తీర్ణాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడారు. కాలుష్యం పెరగకుండా నగరవాసులకు స్వచ్ఛమైన గాలి అందేలా కృషి చేశారు.
హైదరాబాద్ మహానగర జీవవైవిధ్యానికి హరితహారమనే మణిహారాన్ని అలంకరించారు. కానీ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నగర జీవవైవిధ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నారు. జంతు వృక్ష సంపదను పెను ప్రమాదంలో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవ వైవిధ్యానికి తూట్లు పొడుస్తున్నది. వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న వృక్ష, జంతు సంపదను కూకటి వేళ్లతో పెకిలిస్తున్నరు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నరు.
మహా నగరంలోని అటవీ భూములను కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నరు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి గ్రేటర్ చుట్టూ ఉన్న అటవీ భూములపై కన్నేసి ఒక్కొక్కటిగా రియల్ ఎస్టేట్ బడా వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన అగ్రి ఫారెస్ట్‌ను హైకోర్టు నిర్మాణానికి అప్పగించారు.
మూసీ నది జన్మస్థాన దామగుండం, అనంతగిరి భూములను వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రానికి అప్పగించేశారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించేందుకు సిద్ధం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి నిర్ణయాల వల్ల గ్రేటర్ హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారడం ఖాయమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదేండ్లలో 58 శాతం పెరిగిన జీవవైవిధ్యం..
భారతదేశంలో అత్యధికంగా జీవవైవిధ్యం కలిగిఉన్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. గడిచిన పదేండ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో జీవవైవిధ్యం గణనీయంగా మెరుగుపడింది. ఇది 2012 నుంచి 2022 వరకు నగర జీవవైవిధ్య సూచిక(సీబీఐ) 58 శాతం పెరుగుదలను చూపింది. భారతదేశంలో ఇంత మొత్తంలో జీవవైవిధ్యం పెరుగుదల కలిగిన ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ లక్షలాది మొక్కలను నాటడంతో నగరానికి పచ్చని హారం అల్లుకుంది. కేసీఆర్ తలపెట్టిన హరితహారం ఫలితాలు నగరంలో మంచి ఫలాలను అందిస్తున్నాయి.
ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా మార్చిన కేసీఆర్
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రేటర్ హైదరాబాద్‌ను కేసీఆర్ తన విజన్‌తో ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా మార్చారు. గత ప్రభుత్వంలో వరుసగా 8 సార్లు హరితహారం ద్వారా ఏటా గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి మొక్కలను నాటారు.దీని ఫలితంగా హైదరాబాద్ మహానగర పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు 33.15 చదరపు కిలోమీటర్లున్న అటవీ విస్తీర్ణం కేసీఆర్ పాలనలో 81.81 స్క్వేర్ కిలోమీటర్లకు పెరిగినట్లు ఎఫ్ఎస్ఐ(ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా) ప్రకటించింది.
ఎఫ్‌ఎస్‌ఐతో పాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్) సంస్థలు 2020 సంవత్సరానికి హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా గుర్తించింది. 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు ఈ పోటీలో పాల్గొనగా, హైదరాబాద్ నగరానికి ఈ ఘనత దక్కింది. పచ్చదనం, అటవీ విస్తీర్ణాన్ని పెంచి గత సర్కారు జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తే అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లు, జంతువులను అంతమొందిస్తూ కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1159 జాతుల మొక్కలు..493 జాతుల జంతువుల హననం
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే జీవవైవిధ్యానికి మరణశాసనం లిఖిస్తున్నది. రాజేంద్రనగర్‌లోని 130 ఎకరాల్లో 50 ఏండ్లుగా విస్తరించి ఉన్న జీవివైవిధ్యాన్ని భూ స్థాపితం చేశారు. అక్కడ ఉన్న 80 రకాల వృక్షజాతులు, 206 రకాల మూలికలు, 56 జాతుల పొదలతో కూడిన 313 జాతులకు చెందిన 439 రకాల అరుదైన వృక్ష సంపందను నేలమట్టం చేసింది. 16 రకాల క్షీరదాలు, 139 రకాల పక్షిజాతులు, 151 జాతుల అకశేరుకాలతో సహా 348 రకాల జీవరాశులను నేలమట్టం చేసింది.
తాజాగాఆవేదన వ్యక్తం అవుతున్నది. లక్షల కోట్ల విలువైన ఔషధ మొక్కలతో పాటు 258 రకాల పక్షిజాతులు, జింకలు, దుప్పిలు, అడవి పందులు, నెమళ్లు అంతరించిపోనున్నాయి. వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రంతో వెలువడే రేడియేషన్‌తో వచ్చే అనారోగ్య సమస్యల దృష్ట్యా అమెరికా, యూకేలాంటి దేశాలు వీఎల్ఎప్ టెక్నాలజీని ఆ దేశాలు నిలిపివేశాయని, మరీ అలాంటి టెక్నాలజీని దామగుండలో జనావాసాల్లో సమీపంలో ఏర్పాటు చేయడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.