అబిడ్స్, ఆగస్టు 5 : గత తొమ్మిదేండ్లలో హైదరాబాద్ నగరంలో ప్రగతి పరుగులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, గన్‌ఫౌండ్రి డివిజన్ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, మెట్రో విస్తరణ, రైతుల రుణ మాఫీ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్‌గుప్తా నేతృత్వంలో ముస్లింజంగ్ వంతెన వద్ద సీఎం కేసీఆర్ 33 అడుగుల భారీ కటౌట్‌కు క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. అనంతరం భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు అంతా కలిసికట్టుగా పాటు పడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్వి మహేందర్‌కుమార్, సంతోష్ గుప్తా, ఎం ఆనంద్‌కుమార్ గౌడ్, శాంతిదేవి, ఆల పురుషోత్తం రావు, రాంచంద్రరాజు, దళితరత్న మాణిక్ రావు, ఆర్. శంకర్‌లాల్ యాదవ్, బెజిని శ్రీనివాస్, యాదగిరి, జై శంకర్, శంకర్, క్రాంతి, బి రమేశ్ గుప్తా, సురేశ్ ముదిరాజ్, ముఖేశ్ ముదిరాజ్, ఎ వినోద్ యాదవ్, ప్రేమ్ అగర్వాల్, మానిక్ లత, విశ్వ ప్రేమ్, మీనాక్షి సిక్వాల్, రామరాజు, బాల్ ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.