ఖాకీల్లో కార్ గుబులు
నేపాల్ దొంగలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఒక ఎస్ఐతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్వర్వులు జారీ చేశారు.
- 6 నెలలుగా పోస్టింగు లేని 31 మంది ఎస్సైలు
- ఇటీవల సైబరాబాద్ నుంచి వచ్చిన 31 మందీ అక్కడే..
- పోస్టింగు లేకపోవడంతో బందోబస్తు డ్యూటీల వైపు మళ్లింపు
- ఫలితంగా పీఎస్‌లలో సిబ్బంది కొరతతో తగ్గిన నిఘా
- కాంగ్రెస్ హయాంలో పోలీసులకూ తప్పని వేధింపులు!
సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): నేపాల్ దొంగలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఒక ఎస్ఐతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. నేపాల్ దొంగలను పట్టుకోవడం, వారిని అదుపు చేయడం అనేది సిటీ పోలీసులోని టాస్క్‌ఫోర్స్, పోలీసు విభాగాలకే పెద్ద ఛాలెంజింగ్ కాగా ఏదో ఒక చర్యతో దర్యాప్తు నుంచి జనాలను తప్పుదోవ పట్టించడానికి పెట్రోలింగ్ సరిగా చేయలేదంటూ ఒక ఎస్ఐపై క్రమశిక్షణాచర్య కింద కార్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇలా.. ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఎవరైనా పోలీసు అధికారిని కానీ సిబ్బందిని కానీ క్రమశిక్షణా చర్యల కింద శిక్షించాలంటే కార్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాల్సిందేనంటూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు కమిషనరేట్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే సీపీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కార్‌హెడ్ క్వార్టర్స్ 62మంది ఎస్ఐలతో నిండిపోయింది. ఇందులో ఇటీవల సైబరాబాద్ నుంచి హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయి వచ్చిన 31 మంది ఎస్ఐలతో పాటు గత ఐదారునెలలుగా చిన్నచిన్న లోపాలతో కార్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ అయిన 31 మంది ఎస్ఐలు ఉన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో పోలీసులకు వేధింపులు తప్పడం లేదని, సొంత శాఖలోనే పోలీసు ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలతో చాలామంది పోలీసు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చిన్నచిన్న తప్పులకు అటాచ్మెంట్లు..!
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్ నగర పోలీసు విభాగంలో కీలక కేంద్రంగా ఉంటోంది. నగరంలో జరిగే పలు బందోబస్తులు, వివిధ సెక్యూరిటీ అవసరాల నిమిత్తం ఈ హెడ్‌క్వార్టర్స్ నుంచే బలగాలను పంపిస్తారు. అటువంటి కార్‌హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం చిన్నచిన్న తప్పులు చేసిన పోలీసు సిబ్బందితో నిండిపోతున్నది. గత 6-7నెలలుగా కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుల్, హోమ్‌గార్డులను హెడ్‌క్వార్టర్స్‌కు అటా చ్ చేస్తుండటంతో సిటీలోని పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత ఏర్పడుతున్నది. ఇప్పటికే పలు స్టేషన్ల నుంచి అటాచ్ అయిన 31మంది ఎస్సైలు నెలల తరబడిగా కార్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంటున్నారు. వారికి గత ఐదారునెలలుగా ఏ పోలీస్ స్టేషన్‌ను కేటాయించకుండా కేవలం హెడ్ క్వార్టర్స్‌లోనే ఉంచుతూ ఏదో ఒక డ్యూటీ వేసి పంపిస్తున్నట్లు తెలిసింది. వీరంతా అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారు కాదు.. డ్యూటీ సమయంలో చేసిన చిన్న చిన్న లోపాల కారణంగా వారికి అటాచ్మెంట్ శిక్ష వేసినట్లు పోలీసులే మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా కమిషనరేట్ పరిధిలో ఎవరైనా పోలీసు అధికారి కానీ సిబ్బంది కానీ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వారిపై ఆరోపణలు వస్తే వెంటనే సస్పెండ్ చేయడమో లేక వారికి చార్జ్ మెమో ఇవ్వకుండా హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద పనిష్మెంట్ కింద చూస్తున్నామని పోలీసులే చెబుతున్నారు.
సీవీ ఆనంద్ సీపీగా ఉన్న సమయంలో..
గతంలో ఎవరైనా చిన్నచిన్న తప్పులు చేస్తే వారిని కార్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసి 2-3 నెలల తర్వాత తిరిగి ఏదో ఒక పోలీస్ స్టేషన్‌కు కానీ వింగ్‌కు కానీ పోస్టింగ్ ఇవ్వడం సహజంగా జరిగేది. ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో కార్ హెడ్‌క్వార్టర్స్‌లో ఒక్క ఎస్ఐ కూడా కనిపించవద్దని, ఎవరైనా తప్పుచేస్తే విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయడమో లేదా మెమో ఇవ్వడమో చేయాలి తప్ప వారిని హెడ్ క్వార్టర్స్‌కు పంపి అక్కడ ఖాళీగా లేదా ఇష్టమొచ్చిన డ్యూటీలు వేస్తూ బాధ్యతారాహిత్యంగా ఉంచవద్దంటూ స్ట్రిక్ట్‌గా చెప్పేవారని ఒక పోలీసు అధికారి చెప్పారు. అటువంటి పరిస్థితి ప్రస్తుతం కమిషనరేట్‌లో లేదని కీలక పోస్టింగుల్లో ఉన్న ఇద్దరు ఉన్నతాధికారులు కమిషనరేట్ మొత్తంలో ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఏ విభాగంలో నైనా తమకు నచ్చని, తమ టీమ్‌కు నచ్చని వారిని ఆయా స్టేషన్ల నుంచి తప్పించడానికి కార్కు ఎటాచ్ చేస్తున్నారంటూ పోలీసులలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ 31మందికి పోస్టింగే లేదు..!
ఇటీవల సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో జరిగిన బదిలీలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇన్స్పెక్టర్లకు సంబంధించి సైబరాబాద్‌లో పోస్టింగ్‌ల వద్ద లక్షలులక్షలు చేతు లు మారితే.. ఎస్ఐలను హైదరాబాద్ నుంచి సైబరాబాద్‌కు పంపించిన క్రమంలో లక్షల రూపాయల బేరం కుదుర్చుకున్నట్లుగా చర్చ జరిగింది. ఇదే సమయంలో తమ విల్లింగ్ లేకున్నా సైబరాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 31మంది ఎస్ఐలకు ఎక్కడా పోస్టింగు ఇవ్వకుండా ప్రస్తుతం కార్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంచుతూ అడపాదడపా బందోబస్తులు, ఇతర డ్యూటీలు వేస్తున్నట్లు తెలిసింది. వీరి పోస్టింగుల విషయంలో ముఖ్యనేతతో పాటు పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు పైరవీలు చేస్తున్నా.. కొన్ని కారణాల వల్ల వారికి పోస్టింగులు ఇవ్వడం లేదంటూ కమిషనరేట్‌లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ప్రధాన స్టేషన్లు కావాలంటూ అడుగుతున్న ఎస్ఐలకు కొన్ని కండిషన్లు పెట్టారని, వీటి దగ్గరే పోస్టింగులు ఆలస్యమవుతున్నట్లుగా కూడా పోలీసు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. వీరందరూ ప్రస్తు తం స్టేషన్ పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. కమిషనరేట్‌లో ఉన్న 72 పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడంతో పాటు కార్ హెడ్‌క్వార్టర్స్‌లో 62మంది ఎస్సై లు అడపాదడపా డ్యూటీలతో పూర్తిస్థాయి బాధ్యతలు లేకుండా ఉండడంతో హైదరాబాద్ నగరంలో నేరాల శా తం పెరిగి నిఘావైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి సమస్యలు లేవని, గత రెండేళ్లుగా ప్రత్యేకించి ఈ 8 నెలలుగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని పోలీసు సిబ్బంది చెబుతున్నారు.
నేరాలమయంగా కమిషనరేట్..!
నగరంలో ఎక్కడ ఏ నేరం జరిగినా క్షణాల్లో అక్కడకు చేరుకుని నేరస్తులను కట్టడి చేస్తూ నేరాలను అదుపు చేయడంలో రికార్డు సృష్టించిన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ప్రస్తుతం నేరాలమయంగా మారిపోవడానికి పాలనా వైఫల్యం కారణమంటూ ఓ రిటైర్డ్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కార్ హెడ్‌క్వార్టర్స్‌కు కేవలం ఎస్సైలు మాత్రమే కాకుండా ఇన్స్పెక్టర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, హోంగార్డులు, కానిస్టేబుళ్లు.. ఇలా సుమారుగా 100 మందికి పైగా అటాచ్ అయి ఉన్నట్లు సమాచారం. ఇంతమంది ఒకేసారి స్టేషన్లలో లేకుండా హెడ్ క్వార్టర్స్‌లో ఉండటంతో పలు స్టేషన్ల నిర్వహణ కష్టమవుతున్నదని, సెక్టార్ల వారీగా పెట్రోలింగ్, ఇతర అంశాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెప్పారు. ఇప్పటికైనా డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఎస్ఐల పరిస్థితిపై దృష్టిపెడితే కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్లలో కొంతమేరకు ఎస్సైల, సిబ్బంది కొరత తీర్చినవారవుతారని పోలీసులు అంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

