హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో (Banjarahills) ఓ కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని స్టడీ సర్కిల్ (Study Circle) వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమింగా నిర్ధారించారు. గాయపడినవారికి వివరాలు తెలియాల్సి ఉన్నది.