సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం-2025లో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు, సవరణలో సోమవారం ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. గతంలో కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో స్వల్పంగా ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి 2024 నాటికి కోటి 10 లక్షలు ఉండగా, తాజా జాబితా ప్రకారం మూడు జిల్లాలలోని 28 నియోజకవర్గాల్లో కలిపి కోటి 12 లక్షలుగా నమోదు అయ్యారు.
ఏడాదిలో రెండు లక్షల ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాలను పక్కాగా చేపట్టామని, నకిలీ ఓటర్లు ఒకరికి రెండు, అంతకు మించి ఓటరు కార్డులున్న వారిని గుర్తించి తొలగించినట్లు అధికారులు చెప్పారు. కాగా మూడు జిల్లాల పరిధిలోని 28 నియోజకవర్గాల్లో అతి పెద్ద నియోజకవర్గంగా 7.65 లక్షల ఓటర్లతో శేరిలింగంపల్లి మొదటి స్థానంలో, 7.34 లక్షల ఓటర్లతో కుత్బుల్లాపూర్ రెండవ స్థానంలో నిలిచాయి. 2.32 లక్షల ఓటర్లతో చార్మినార్ చివరి స్థానంలో నిలిచింది.
Pi