కవాడిగూడ, ఏప్రిల్ 19: సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అప్పర్ ట్యాంక్‌బండ్ వద్ద దోమల్‌గూడ పోలీసులు ఒక ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తుల వద్ద 3 ప్లాస్టిక్ బాక్సులతో ఉన్న క్లాత్ బ్యాగ్‌ను పరిశీలించారు. తనిఖీల్లో వారివద్ద రూ.3.22 కోట్ల విలువైన మూడు కిలోలకు పైగా ఉన్న బంగారు ఆభరణాలను లభించాయి. ఆ ఇద్దరు యువకులను ఆభరణాలపై ప్రశ్నించగా.. హిమాయత్‌నగర్‌లోని మహావీర్ చాంబర్లో ఉన్న విరించి డైమండ్‌కు చెందిన ఆభరణాలుగా వెల్లడించారు. అయితే, వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఐటీ శాఖకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.