Electric Vehicles | సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో సోమవారం 131 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ వాహనాల రోడ్డు ట్యాక్స్ 24.69 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు 46,300 ఉంటుంది. కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన మినహాయింపు విధానంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు ట్యాక్సీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. దీంతో ఆ వాహనాలకు సంబంధించి మొత్తం రూ.25.15 లక్షల పన్ను మినహాయింపు లభించింది. ఇందులో ఆటో రిక్షాలు 3, గూడ్స్ క్యారేజి 1, మోటార్ కార్లు 6, మోటార్ సైకిల్స్ 121 ఉన్నాయని హైదరాబాద్ జాయిట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి. రమేశ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగి కాలుష్య రహిత నగరంగా మార్చడానికి వాహనదారులు ముందుకొచ్చేలా ఈవీ వాహనాలపై మినహాయింపు ఇస్తున్నట్టు వివరించారు.