శనివారం 30 మే 2020
Hyderabad - May 12, 2020 , 23:48:56

రిటైర్డ్‌ ఉద్యోగికి రూ. 1.05 కోట్ల టోకరా

రిటైర్డ్‌ ఉద్యోగికి రూ. 1.05 కోట్ల టోకరా

సిటీబ్యూరో: ఓ బ్యాంకు మేనేజర్‌  రూ. 1.05 కోట్లు మోసం చేశారంటూ  సికింద్రాబాద్‌కు చెందిన మునవార్‌.. ఎయిర్‌ఫోర్స్‌ రిటైర్డ్‌ ఉద్యోగి సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  రిటైర్డ్‌ సమయంలో వచ్చిన బెనిఫిట్స్‌ను డిఫెన్స్‌కాలనీలోని ఆంధ్రాబ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. అప్పటి బ్యాంకు మేనేజర్‌ఎన్‌వీ సుబ్రహ్మణ్యం అతడి  స్నేహితులు చంద్రశేఖర్‌, పార్థసారథిలను మునవార్‌కు పరిచయం చేశాడు. చంద్రశేఖర్‌  మునవార్‌కు ప్లాట్‌ ఇస్తానంటూ రూ. 40 లక్షలు తీసుకున్నాడు.  తర్వాత విభేదాలు రాగా.. చంద్రశేఖర్‌ ఇచ్చిన చెక్కులను బ్యాంకులో వేయగా..  బౌన్స్‌ అయ్యాయి. జంగారెడ్డిగూడేనికి చెందిన పార్థసారథికి రూ. 65 లక్షలు బ్యాంకు మేనేజర్‌ ఇప్పించాడు. అందుకు గ్యారంటీగా ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్‌ అయ్యాయి. 

 బహుమతి వచ్చిందంటూ.. డబ్బులు కాజేశారు

నగరానికి చెందిన ఓ వ్యాపారికి సైబర్‌నేరగాళ్లు ఫోన్‌ చేసి.. తాము ఫోన్‌ పే సంస్థ నుంచి మాట్లాడుతున్నామని, మీ ఫోన్‌ నంబర్‌కు రూ. 2 లక్షల విలువైన బహుమతి వచ్చిందంటూ నమ్మించారు.  వ్యాపారితో ఫోన్‌ పే యాప్‌ డౌన్‌ లోడ్‌ చేయించి.. దానికి బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయించి.. రెండు దఫాలుగా  రూ. 64 వేలు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు.  మరో ఘటనలో ఉప్పుగూడకు చెందిన ఠాకూర్‌ మనుసింగ్‌ అనే వ్యాపారికి.. లోన్‌ ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు పలు దఫాలుగా లక్ష రూపాయలు కాజేశారు.  సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo